మోహన్ బాబు చేసిన తప్పు అదే..!
తమను అమితంగా ప్రేమించడమే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి.
మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది.
అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.