ఎమ్మెల్సీ కవితకు వింత జబ్బు..!

KAVITHA KALVAKUNTLA
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు.. జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవితపై మాజీ డిప్యూటీ సీఎం.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి సంచలన వ్యాఖ్యలు చేశారు . స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో కడియం శ్రీహారి మాట్లాడుతూ ” మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఓ వింత జబ్బు ఉంది..
మీడియాలో కన్పించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుంది. అందుకే తమ ప్రభుత్వంపై ఎలాంటి ఆధారాలు లేకుండా నిత్యం ఏదోక విధంగా మీడియాలో కన్పించాలని అవాక్కులు.. చవాక్కులు పేలుస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీసీ కులగణనకు ఎమ్మెల్సీ కవితకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమి చేశారు.
ఎంత మందికి న్యాయం చేశారు అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. స్టేషన్ ఘన్ పూర్ కు ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఉప ఎన్నికల్లోస్తే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. అధికారం కోల్పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. తెల్లారిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు అని ఆయన ఆరోపించారు.
