MLA వేముల వీరేశం టార్గెట్ అధికారులా..?.. నాయకులా..?
వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యే.. 2018 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే నెపంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టారు. అక్కడిదాక బాగానే ఉంది. ఇటీవల భువనగిరి జిల్లా ఇరిగేషన్,రెవిన్యూ శాఖ అధికారుల సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు వచ్చిన నేపథ్యంలో హెలిఫ్యాడ్ లో స్వాగతం పలకడానికి జిల్లా ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలతో కల్సి ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడకి వెళ్లారు.
అయితే అక్కడున్న పోలీసు అధికారులు అనుమతి లేదంటూ ఎమ్మెల్యే వేములను అడ్డుకున్నారు. అప్పుడు ఇది ఎంత వివాదస్పదమైందో మనకు తెల్సిందే. అయితే ఈ సంఘటనపై ఎమ్మెల్యే వేముల తగ్గేదే లేదని అంటున్నారు అంట.. ఆకలినైన భరిస్తాను కానీ అవమానాన్ని భరించలేను అని తేగేసి చెబుతున్నారు అంట. అందుకే ప్రోటోకాల్ పాటించని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి పిర్యాదు చేశారు. ఆ సంఘటన జరిగిన రోజు రాచకొండ సీపీతో మాట్లాడితే స్పందన కూడా తనకు సరిగా లేదని అనుచరుల దగ్గర వాపోయారంట.
అందుకే తనను అవమానించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే కేంద్ర హోం శాఖ అధికారులను సైతం కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఇలా అవమానం జరిగిందంటే వినడానికి వింపుగా ఉంటుంది. అది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే.. రెండు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేను గుర్తు పట్టలేదు అంటే వారి వెనక ఎవరైన ఉన్నారా..? అనే కోణంలో కూడా వేముల ఆలోచిస్తున్నారు అని టాక్.
ఈ సంఘటన జరిగిన తర్వాత జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు కానీ ఇతర నేతలు కానీ తనను కనీసం పలకరించలేదంట. స్థానిక నాయకత్వం కూడా అంటిముట్టని విధంగా ఉండటంతో వేముల వీరేశాన్ని ఇంకా అవమానించినట్లు.. బాధించినట్లు చేసింది . ఓ దళిత నేత ఎదగడం ఈ జిల్లాలో పార్టీలో ఎవరికైన ఇష్టం లేదేమో.. అందుకే ఎవరూ కూడా సప్పు చేయడం లేదు అని .. అందుకే ఈ అంశం వెనక ఎవరూ ఉన్న కానీ ఐ డోంట్ కేర్ అంటూ కేంద్రానికి విన్నవించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. మరి వేముల వీరేశం టార్గెట్ అధికారులా.. లేదా ఎవరైన నాయకులా అని కాలమే సమాధానం చెప్పాలి.