పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది
రాకేశ్ రెడ్డికి వచ్చిన ఆధిక్యాన్ని.. లిస్టులో తీన్మార్ మల్లన్నకు చూపిస్తున్నారు.సీఈవో వికాస్ రాజుతో పాటు ఆర్వో వెంటనే స్పందించి న్యాయం చేయాలి.కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తుంది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరుతున్నాం.ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించడం సరైనది కాదని అన్నారు.