KCR రైట్ అంటున్న మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి -మహా గణపతి కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” చదువుకున్న ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. కులవృత్తులే కీలకం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటే అందరికి ఉపాధి కలుగుతుంది.
మనం ఉపాధిని పొందటమే కాకుండా పదిమందికి మనం ఉపాధి కల్పించినవారమవుతాము అని ” వ్యాఖ్యానించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ” దేశంలోనైన రాష్ట్రంలోనైన ఆయా జనాభా ఆధారంగా సర్కారు కొలువులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ నౌకరి ఇవ్వడం కష్టం. మన రాష్ట్ర జనాభా ఆధారంగా మన రాష్ట్రంలో మూడున్నర లక్షల ప్రభుత్వ కొలువులు మాత్రమే ఉంటాయి.
అందుకే కులవృత్తులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గొర్రెల పంపిణీ,చేపపిల్లల పంపిణీ, ఓనర్ కమ్ డ్రైవర్ లాంటి అనేక పథకాలను తీసుకోస్తున్నాము.. టీహాబ్ ,వీహాబ్ లాంటి సంస్థలతో అనేక ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము” అని అన్న మాటలను బీఆర్ఎస్ శ్రేణులు నేడు గుర్తు చేస్తున్నారు.
ఆ మాటలను వారు కోట్ చేస్తూ ” నాడు చదువుకున్న ప్రతి ఒక్కర్కి సర్కారు కొలువు ఇవ్వడం కష్ట కాబట్టే కులవృత్తులకు కేసీఆర్ పునర్జీవం పోశారు. నేడు అదే అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికైన వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషం. ప్రజలు ఇప్పటికైన గ్రహించాలి అప్పట్లో కాంగ్రెస్ అధికారం కోసం ఏడాదికి రెండు లక్షల సర్కారు కొలువులు.. మెగాడీఎస్సీ అని అబద్ధపు అలవికానీ హామీలిచ్చారని” సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు