మంత్రి కొండా సురేఖ కు షాక్

 మంత్రి కొండా సురేఖ కు షాక్

Konda Surekha Minister Of Telangana

వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు.

ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు.

తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. సాక్షులుగా దాసోజ్ శ్రవణ్, బాల్క సుమన్ , సత్యవతి రాథోడ్,తుల ఉమ లను సాక్షులుగా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *