రెచ్చిపోండి కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి కొమటిరెడ్డి పిలుపు

Komatireddy Venkat Reddy Minister Of Telangana
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోకసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి,మంత్రులను, కాంగ్రెస్ పార్టీ నేతలను ఒక్క మాట అన్నా కానీ సహించకండి.
రోడ్లపై తిరగండి. బీఆర్ఎస్ నేతలు తిరిగితే అడ్డుకోండి.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనేది బీఆర్ఎస్ నేతల లక్ష్యం.. పదేండ్లు తెలంగాణ సెంట్మెంట్ ను వాడుకోని పరిపాలన చేశారు..
మళ్లీ అదే సెంట్మెంట్ ను రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్ళు ఓట్లు వేయకపోతే హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచేవారా అని ఆయన ప్రశ్నించారు.