కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పా….?-ఎడిటోరియల్ కాలమ్

 కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పా….?-ఎడిటోరియల్ కాలమ్

KCR

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నిన్నటి దసరా వేడుకల వరకు అది అధికారక కార్యక్రమమైన.. అధికారయేతర కార్యక్రమమైన.. సందర్భం ఏదైన సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయంది ఆ కార్యక్రమం పూర్తయినట్లు ఇప్పటివరకు ఏ కార్యక్రమం లేదు.. అధికార కాంగ్రెస్ కు చెందిన విప్ దగ్గర నుండి సీఎం వరకు.. పీసీసీ నేత దగ్గర నుండి మంత్రి వరకు మాట్లాడితే కేసీఆర్ పదేండ్లు అలా చేసిండు.. ఇలా చేసిండు అనే ఆరోపణలే తప్పా ప్రజలు ఎందుకు గెలిపించారో.. గెలిస్తే ఏమి చేస్తామని హామీచ్చారో.. వాటిని అమలు చేయకుండా కాలం గడుపుతున్నారు.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పదేండ్లలో కేవలం ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల గురించి కానీ పార్టీల గురించి కానీ విమర్శలు చేసినట్లు గుర్తుకు లేదు. అధికారంలోకి రాకముందు రాజకీయ విమర్శలు ఎన్ని చేసిన కానీ ప్రజలు అంగీకరిస్తారు.. మేధావులు సైతం ఆలోచిస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే కేవలం ఓట్లేసి గెలిపించిన ఓటర్లు. మేధావివర్గమే కాదు సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. డిసెంబర్ తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పది నెలలుగా చెప్పుకోదగ్గ కార్యక్రమం కానీ అమలు చేసిన పథకం కానీ లేదన్నది ఇటు గాంధీ భవన్ వర్గాల.. అటు మేధావుల అభిప్రాయం..

పది నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు చేసింది చెప్పుకోవాల్సి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అరకోర రైతు రుణమాఫీ తప్పా ఇంతవరకూ చేసిన ఏ కార్యక్రమం లేదన్నదే గాంధీ భవన్ వర్గాలు విస్తూపోతున్నారు. మేమిచ్చాము అని చెప్పుకుంటున్న ముప్పై నలబై వేల ఉద్యోగాల్లో ఇటీవల నిర్వహింఛిన డీఎస్సీ తప్పా మిగతా పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు.. పరీక్షలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే నిర్వహించినవే. ప్రభుత్వం వచ్చి పది నెలలవుతున్న కానీ ఇంకా కేసీఆర్ & కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారంట. అందుకే ఇప్పటివరకు ఒక్క కోమటీ రెడ్డి జగ్గారెడ్డి లాంటి నాయకులు తప్పా సీనియర్ నేతలు ఎవరూ బీఆర్ఎస్.. కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు..

ఏమైన ఉంటే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తప్పా ఎక్కడా ఎప్పుడూ కూడా సీనియర్ నేతలు టార్గెట్ చేసినట్లు ఇంతవరకూ గమనించలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆయనకు అనుకూలంగా ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ప్రజాసేవ కంటే రేవంత్ రెడ్డికి సేవ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేండ్లలో కేసీఆర్ ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించిన.,. మీడియా సమావేశం నిర్వహించిన కానీ ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయకుండా కేవలం తాను ఏమి చేయదలచుకున్నాడు.. దాని వల్ల లాభానష్టాలు వివరించాడే తప్పా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు.. కేసీఆర్ పది మాటలు మాట్లాడితే అందులో ఎనిమిది మాటలు ప్రజలకు ఉపయోగపడే.. లబ్ధి చేకూరేలా ఉండేవి..

కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే పది మాటల్లో ఎనిమిది మాటలు కేసీఆర్ & బ్యాచ్ ను విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కన్పిస్తుందని సీనియర్ నేతలు గుసగుసలాడు కుంటున్నారు. ఇప్పటికైన రేవంత్ రెడ్డి కేసీఆర్ & బ్యాచ్ పై పెట్టే శ్రద్ధ కంటే ప్రజలకు మంచి ఎలా చేయాలనే అంశం గురించి ఆలోచించాలని హితవు పలుకుతున్నారంట. ఇటీవల పీసీసీ తో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు మాకు కాదు క్లాస్ పీకాల్సింది ముఖ్యమంత్రి & ఆయన అనుకూల నేతలందరికి అని ముక్తకంఠంతో తేల్చి చెప్పారంట. ఇప్పటికైన ప్రజలు ఎందుకు గెలిపించారో ఆ దిశగా ముందుకెళ్లకపోతే భవిష్యత్తులో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు విన్నవించుకున్నారంట సీనియర్స్.. ఇప్పటికైన తీరు మారుతుందో లేదో..? మున్ముందు..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *