TTD ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 11తారీఖు నుండి 17వరకు సెలవులు మంజూరు చేసింది.
అయితే సెలవుల రోజు తిరుపతి వదిలి వెళ్లోచ్చు.కానీ రాష్ట్రం దాటి వెళ్లకూడదని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.మరోవైపు ఈ నెల 12తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదే రోజు రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుపతి వెళ్లనున్నారు..
ఈలోపు ధర్మారెడ్డికి సెలవులు మంజూరు చేయడం చర్చాంశనీయం అయింది.అయితే గతంలో ధర్మారెడ్డి అధికార పార్టీతో అంటకాగారని అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి.