రేవంత్ టార్గెట్ గా ఢిల్లీకి కేటీఆర్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
అమృత పథకంలో స్కాం జరిగిందని గత కొంత కాలంగా మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు విమర్శించిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్రానికి పిర్యాదు చేయడానికి ఆయన వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా టెండర్లను పిలిచారని కేటీఆర్ ఆరోపణ.. రూ. 8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చారని కేటీఆర్ ప్రధాన ఆరోపణ.