ఫామ్ హౌజ్ పై కేటీఆర్ క్లారిటీ
జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు.
ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నాను . అది బఫర్ జోన్లో ఉంటే మాత్రం దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తాను .
అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలు రేవంత్ రెడ్డి, పొంగులేటి, కేవీపీ, గుత్తా, పట్నం, మధుయాష్కీలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. పొంగులేటి ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉంది. వాటితోనే కూల్చివేతలు ప్రారంభించండి’ అని ఆయన తెలిపారు.