ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీలా..?

తెలంగాణలో కాంగ్రెస్ గత పది హేను నెలల పాలనలో ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే 250 కోట్లతో అందాల పోటీలా? కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు.. తెలంగాణ డౌన్ ఫాలింగ్! బంగారం లాంటి రాష్ర్టాన్ని రేవంత్ కుప్పకూల్చిండు.
క్యాన్సర్‌తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రే అప్రూవర్‌గా మారిండు. డబ్బుల్లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్లా? రేవంత్ దాటిన రేఖలపై మేమూ మాట్లాడగలం. మేం నోరిప్పితే ఆయనకు ఇంట్లో అన్నం పెట్టరు! తనదాకా వస్తే నీతిసూత్రాలు.. నైతిక విలువలా? కేసీఆర్‌పై ద్వేషంతో రైతులపై పగ సాధిస్తున్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి 40 సార్లు కాకుంటే 400 సార్లు పోయి మోదీ, రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు” అని మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు..
