మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ కీలక భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్.
ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ మున్ముందు ఎలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి ఇలా పలు అంశాల గురించి వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.