కేటీఆర్, హారీష్ లకు కోమటిరెడ్డి ఉచిత సలహా..?

Komatireddy Venkat Reddy Minister Of Telangana
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చారు. నిన్న సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మాల్ నూతన మార్కెట్‌కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళనకు మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు అడ్డుపడుతున్నారు.. మూసీ నదిని ప్రక్షాళన చేసి తాగుసాగునీరు అందించాలని తమ ప్రభుత్వం ఆరాటపడుతుంది. మరోవైపు ఎలానైన మూసీ నది ప్రక్షాళనను అడ్డుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావులు పేదలను ఉసిగొల్పుతున్నారు. మూసీ నది పక్కన ఉన్న పేద ప్రజల ఆరోగ్యాన్ని రక్షించ
