RCB లోకి కేఎల్ రాహుల్ …?

 RCB లోకి కేఎల్ రాహుల్ …?

KL Rahul Cricket Player

టీమిండియా స్టార్ ఆటగాడు.. ఐపీఎల్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రానున్న ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్ .

ఈ విషయంపై రాహుల్ సమాధానమిచ్చిన తీరు సైతం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉన్నాయి. ఆర్సీబీతో చేరాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ సైతం ఆశాజనకంగా బదులిచ్చారు. ఆర్సీబీకి నేను వీరాభిమానిని. చాలా కాలం నుండి ఆ జట్టును ఫాలో అవుతున్నాను .

గతంలో మీరు కూడా ఆర్సీబీ కి ఆడారు. మీరు తిరిగి మళ్లీ ఆర్సీబీకి ఆడాలనుకుంటున్నాను అని ఆభిమాని రాహుల్ ను ప్రశ్నించాడు. దీనికి ప్రత్యుత్తరంగా రాహుల్ నవ్వుతూ అలా జరగాలని ఆశిద్దాం అని బదులిచ్చాడు.

అయితే మరోవైపు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై ఓటమి అనంతరం లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఓనర్ ఏకంగా రాహుల్ ను మైదానంలోనే అగ్రహాం వ్యక్తం చేయడం పెనుదుమారమే రేపిన సంగతి విధితమే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *