కిషన్ రెడ్డికి పచ్చ కామెర్లు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని రాష్ట్రమంతటా తెలుసు.
పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీకింద పని చేస్తున్న కిషన్ రెడ్డికి లాగే కన్పిస్తుంది. వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి అందరూ అలాగే ఉంటారనుకోవడం మూర్ఖత్వం అని .. అది వారి కర్మ అని మండిపడ్డారు.