బోనస్ అంటూ బోగస్ మాటలు

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు.
రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు..
