విద్యుత్ కమీషన్ పై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే… ఈ కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కమీషన్ చైర్మన్ ను తప్పించాలని ఆదేశించింది.. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ పద్దు గురించి జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కమీషన్ చైర్మన్ ను సాయంత్రంలోపు ప్రకటిస్తాము. విద్యుత్ శాఖలోని అవకతవకలపై కమీషన్ వేయమని కోరిందే బీఆర్ఎస్ నేతలు.
కమీషన్ ఎదుట విచారణకు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు..?.. విద్యుత్ శాఖానే కాదు అన్ని శాఖాల్లోని కాంట్రాక్టు పనులు తమ బంధువులకు ఇచ్చారు.. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క యూనిట్ సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదు.. అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని వాడలేదు.. కాంగ్రెస్ పార్టీనే విద్యుత్ కేంద్రాలను ప్రారంభించింది.. కమీషన్ల కోసం కాలం చెల్లిన విధానాన్ని అవలంభించారు.. విద్యుత్ సంస్కరణల పేరుతో వేల కోట్లను అక్రమంగా సంపాదించారు” అని అన్నారు.