సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన.!

anumula revanth reddy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈరోజు గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సుధీర్ఘంగా భేటీ అయింది.భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాబినెట్ లో చర్చించిన పలు అంశాల గురించి సవివరంగా వివరించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని క్యాబినెట్ లో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
‘ దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను పూర్తి చేశాము. బీసీలకు రాజకీయంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తామని గతంలోనే హామీచ్చాము. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరిస్తాం ‘ ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.