నేడు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ..!

KCR’s key meeting with BRS leaders today..!
బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో త్వరలో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది.