కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!

 కేసీఆర్నే ఓడించారు.!. రేవంత్ రెడ్డి ఎంత..?-ఎడిటోరియల్ కాలమ్ ..!

KCR was defeated. How much is Revanth Reddy..?-Editorial Column ..!

కేసీఆర్ మూడు అక్షరాల పేరు కాదు.. దాదాపు పద్నాలుగేండ్ల పాటు స్వరాష్ట్ర సాధనకై మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ యోధుడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ధీరుడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి పదేండ్లలోనే ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో స్వతంత్ర భారతంలోనే ఏ రాష్ట్రం కూడా సాధించని ఘనతనలను తెలంగాణ సాధించేవిధంగా పాలించిన నాయకుడు. అలాంటి కేసీఆర్ నే స్థానిక నాయకత్వ లోపం.. ఎమ్మెల్యేల పనితీరు నచ్చక బీఆర్ఎస్ పార్టీని మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ఓటర్లు. ఆసరా దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు.. మిషన్ భగీరథ నుండి కాళేశ్వరం వరకు.. మిషన్ కాకతీయ నుండి రైతుబంధు వరకు.. కళ్యాణ లక్ష్మీ నుండి కేసీఆర్ కిట్ల వరకు ఇలా దాదాపు నాలుగోందల పథకాలను పదేండ్లలోనే అమలు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

అలాంటీ కేసీఆర్ ను ఓడించిన తెలంగాణ ఓటర్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిను లెక్క చేస్తారా..?. గత ఏడాదిగా పథకాల అమలు కంటే కేసీఆర్ కుటుంబం.. గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడంపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు దాదాపు నాలుగోందల ఇరవై హామీలను ఇచ్చింది. వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాము అని ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్లు సైతం పంచింది కాంగ్రెస్. డిసెంబర్ తోమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ .. ఆసరా నాలుగు వేలు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం.. రైతుభరోసా కింద రైతులకు పదిహేను వేలు.. రైతు కూలీలకు పన్నెండు వేలు.. మహిళలకు ప్రతి నెల రెండున్నర వేలు ఇస్తామనే కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నమ్మిన ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

తీరా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఆ హామీల అమల ఊసు పక్కనెడితే గత పదేండ్లలో బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పులు కట్టడానికే మిత్తీలు సరిపోవడం లేదు. కాళేశ్వరం లో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో అవినీతి జరిగింది. గొర్రెల పంపిణీ బర్రెల పంపిణీ ఇలా బీఆర్ఎస్ అమలు చేసిన ప్రతి పథకంలో అవినీతి జరిగింది. బీఆర్ఎస్సోళ్లు జైళ్లకెళ్తారు అంటూ గత ఏడాది డిసెంబర్ నాలుగో తారీఖు నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఎన్నికల ప్రచారంలో ఇదే కాంగ్రెస్ నేతలు ఊకదంపుడు ప్రచారం చేశారు. మరి ఆరు గ్యారంటీలు ఇచ్చే సమయంలో గుర్తుకు రాలేదా బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది. వీటిని ఎలా అమలు చేయాలని. ఇదే అంశం గురించి ఎన్నికల సమయంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబెట్ లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఆరు నూరైన.. నూరు ఆరైన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాము.

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మేము సంపదను సృష్టిస్తాము. ఆ సంపదను పేదలకు పంచుతాము.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాము అని చెప్పారు. ఇప్పుడు అవి గుర్తుకు లేదా అని ఇటు రాజకీయ విశ్లేషకులు.. అటు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పదేండ్ల పాటు ఎన్నికల్లో ఇచ్చిన..ఇవ్వని ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ ను ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్పా అమలు చేసింది ఏమి లేని కాంగ్రెస్ ను ఎన్ని స్థానాలకు పరిమితం చేస్తారో.. కేసీఆర్నే ఓడించిన వారికి రేవంత్ రెడ్డి ఎంతనో ఆలోచించుకోవాలని వారి సూచిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *