కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్…!

Gangula Kamalakar
బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్లనే కాదు ఏ కాంగ్రెస్ నేతకు చేతకాదు అని గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆయన ఇంకా మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ అనవాళ్లు చెరిపేయడానికి బ్లాక్ బోర్డుపై చాక్ పీస్ తో రాసిన పేరు కాదు.. తెలంగాణ ప్రజల మదిలో సువర్ణాక్షరాలతో రాసిన పేరు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరాను ఆటకెక్కించగలవా..?.
ప్రతి ఇంటికి తాగు నీరు అందించిన మిషన్ భగీరథను తీసేయగలవా..?. పేదింటి ఆడబిడ్డ పెండ్లికిచ్చే కళ్యాణ లక్ష్మీని కాదనగలవా..?. కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే కాళేశ్వరం లేకుండా చేయగలవా..?. ఏమి చేయగలవు కేసీఆర్ అనవాళ్లు లేకుండా.. అఖరికి నువ్వుంటున్న సచివాలయం కూడా కేసీఆరే నిర్మించిందే అని ఆయన అన్నారు..
