సఫాయి అన్నా నీకు సలాం అన్న ఏకైక సీఎం కేసీఆర్..

 సఫాయి అన్నా నీకు సలాం అన్న ఏకైక సీఎం కేసీఆర్..

Loading

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీఆర్ఎస్  అధికారం కోల్పోయిన కూడా పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ కార్మిక విభాగం పోరాడుతుంది” అని అన్నారు..కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ “హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించారు.కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎనిమిది రూపాయలు ఉన్న హమాలీ కూలీ ఆయన హయాంలోనే 26 రూపాయలకు చేరింది.

కరోనా కాలంలో కేసీఆర్ ప్రెస్ మీట్‌కి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురు చూశారు. ఆయన చెప్పే మాట వినాలి అని చూశారు.35 లక్షల మంది వలస కార్మికులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అన్న కేసీఆర్ గారు, మనసున్న ముఖ్యమంత్రిగా, కార్మిక పక్షపాతిగా కరోనా కాలంలో వలస కార్మికులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సహాయం చేసి, భోజనం పెట్టి ప్రత్యేకంగా రైళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళందరిని స్వస్థలాలకు పంపిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే. అది కేసీఆర్ నాయకత్వం. కార్మికుల పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమ.వలస కార్మికులు తెలంగాణ వాళ్లు కాదని తెలిసినా, వాళ్ళు ఎవరూ తనకు ఓటు వేయరని తెలిసినా కూడా మనసున్న ముఖ్యమంత్రిగా కార్మిక పక్షపాతిగా కేసీఆర్ గారు వాళ్ల కోసం పనిచేశారు.

2004లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా వేలాది ఇండ్లను కార్మిక కేసీఆర్ గారు మంజూరు చేశారు.అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2005వ సంవత్సరంలోనే కార్మిక శాఖ మంత్రిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పించి అర్జున్ సైన్ గుప్తా అనే ఆర్థికవేత్త ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ని అందులో మెంబర్‌గా చేసి ఒక నివేదిక తయారు చేయించారు.సఫాయి అన్నా నీకు సలాం అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరు.సఫారీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఎన్నో పథకాలను అమలు చేశారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే సఫాయి కార్మికులకు మూడుసార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే

ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ గారు అదే అంగన్వాడీ టీచర్లకు రూ. 4,500 ఉన్న జీతాన్ని రూ. 13,650కి పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లకు రూ. 2,200గా ఉన్న జీతాన్ని రూ. 7,800 చేశారు.2014లో ఆశా వర్కర్లకు 2500 రూపాయల జీతం ఉంటే దాన్ని రూ. 9,750 కు పెంచారు. ఆర్పీలకు ఆరువేల రూపాయల జీతం ఇచ్చారు.అయితే ఆరు నెలల నుంచి ఆర్పీలకు జీతాలు దిక్కులేవు. మున్సిపల్ కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు. అయినా ముఖ్యమంత్రి ఫస్ట్ తారీకు జీతాలు ఇస్తుందని అబద్ధాలు చెబుతున్నాడు.రూ. 9000 ఉన్న తమ జీతాన్ని రూ. 27 వేలకు పెంచింది కేసీఆర్ అని ఒక హోంగార్డు కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని చెప్పాడు. కేసీఆర్ గారు ఉంటే పోలీస్ వారితో సమానంగా తమకు పే స్కేల్ ఉండేదని ఆ హోంగార్డ్ చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ తెలంగాణ ఉద్యోగులకు ఇస్తానని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం 73% జీతాలను తెలంగాణ ఉద్యోగులకు పెంచారు.భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ గారు నిలిపారు.మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 12 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపచేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే.ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపచేయలేదు. ఒక కేసీఆర్ గారు వచ్చినంకనే అది ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇవ్వక తప్పదు.గుడి పూజారులకు, మస్జిద్ల మౌలానా, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్.

కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా భారతదేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలేదు. నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ ఒక్కడే.భవన నిర్మాణ కార్మికులకు బీమాతో ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్.క్యాబ్ ఆటో డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్.కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు అన్న కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్మిక విభాగం మీద ఉంది.భూముల విలువ పెరిగితే కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉంటుంది. భవిష్యత్తుపై ఒక విశ్వాసం ఏర్పడుతుంది కేసీఆర్ గారు అదే చేశారు.కాంగ్రెస్ నాయకులు వచ్చి బక్వాస్, బోగస్ మాటలు మాట్లాడుతున్నారని” అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *