“ఆ విషయంలో” రేవంత్ కంటే కేసీఆరే బెటర్..?

 “ఆ విషయంలో” రేవంత్ కంటే కేసీఆరే బెటర్..?

Revanth Reddy VS KCR

తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రాజకీయాలు దిగజారాయి.. ఎల్పీ విలీనం కాన్సెప్ట్ కేసీఆరే తీసుకోచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. మేము ఏమి కొత్తగా చేయడం లేదు. ఈ సంస్కృతిని ప్రారంభించలేదు.. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆరే మొదలెట్టారు అని ఆయన ఆరోపించారు. నాడు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమాన్ని.. తెలంగాణ వాదాన్ని నీరుగార్చడానికి టీ(బీ)ఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను నాడు దివంగత వైఎస్సార్ లాక్కున్న సంగతి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మరిచిపోయినట్లున్నారు అని బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు .

పార్టీ ఫిరాయింపులు జగ్గారెడ్డి ఆరోపించినట్లుగా తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మొదలు కాలేదు.. అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కానీ ఫిరాయింపుల విషయంలో రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే కేసీఆరే బెటర్ అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఫిరాయింపుల చట్టం ప్రకారం అసలు ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలో చేరే సమయంలో తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇది రూల్. కానీ ఎవరూ దీన్ని పాటించరు.. ప్రజలు సైతం పట్టించుకోరు కూడా.. అదే వేరే విషయం. అసలు విషయానికి వస్తే కేసీఆర్ కూడా తెలంగాణలో జరిగిన గత రెండు ఎన్నికల సమయంలో అంటే 2014,2018ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ బీఎస్పీ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకున్నారు.. ధైర్యంగా వారికి మంత్రుల పదవులిచ్చారు. ఇంకా రాజ్యాంగ బద్ధమైన పదవులు కట్టబెట్టారు.కానీ ప్రస్తుతం అలా లేదు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి,కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,పార్టీ నేతల వరకు తాము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాము ధైర్యంగా చెప్పలేకపోతున్నారు శేరిలింగం పల్లి శాసన సభ్యులు అరికెలపూడి గాంధీ విషయంలో. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థలోని నియమనిబంధనల ప్రకారం పీఏసీ ప్రజాపద్ధుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- )చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీకి చెందిన అంటే అధికార పార్టీ తర్వాత మెజార్టీ సభ్యులున్న పార్టీలో ఓ సీనియర్ సభ్యుడికి లేదా ఆ ప్రతిపక్ష పార్టీ సూచించిన ఎమ్మెల్యేకి ఇవ్వాలి . ఇది రూల్. ఇదే రూల్ ను పార్లమెంట్ లో కూడా పాటించింది బీజేపీ..

కానీ తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి అప్పజెప్పారు. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ రూల్ ప్రకారం లేదా అసెంబ్లీ లా ప్రకారం అరికెలపూడి గాంధీ ప్రతిపక్ష ఎమ్మెల్యే.. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నట్లు.ఇదే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ ” అరికెలపూడి గాంధీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే కోటా కిందనే ఇచ్చాము అని అన్నట్లు మీడియాలో వచ్చింది. తాను పార్టీ మారలేదు.. కేవలం రేవంత్ రెడ్డి కప్పింది దేవుడి కండువా .. కాంగ్రెస్ పార్టీ కండువా కాదు , నేను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడ్నే అని ఆయనే తేల్చి చెప్పారు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు ఉండటం తెలంగాణ భవన్ కు రావాలి కదా అని బీఆర్ఎస్ శ్రేణులు వాదన…

ఈ వాదనలో నిజం లేకపోలేదు. గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ లో ఉన్నమని చెప్పారు తప్పా మేము లేము అని చెప్పలేదు. అఖరికి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కూడా అప్పటి స్పీకర్ కు లేఖ కూడా రాశారు బీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేసీఆర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులిచ్చినప్పుడు మా పార్టీ అనే చెప్పినట్లు గుర్తు. సో పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇరు పక్షాలది తప్పు అయిన కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్ .. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ సమాజం బాగుకోసం.. తెలంగాణ అభివృద్ధి కోసం అని ధైర్యంగా చెప్పారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెప్పలేకపోతున్నారు.. చెబితే వాళ్ల ఎన్నికల మ్యానిఫెస్ట్ లో పెట్టిన పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలను చేర్చుకోము.. చేర్చుకోవాల్సి వస్తే తమ పదవులకు రాజీనామా చేయాలన్నది తప్పినట్లవుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి హారీష్ రావు ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు అటు రాహుల్ గాంధీని మాములుగా కంటెంటుతో కొట్టడంలేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడలా కాంగ్రెస్ తీరు ఉంది .. అందుకే ఈ విషయంలో రేవంత్ కంటే కేసీఆరే బెటర్ అని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *