బీసీసీఐకి కావ్య మారన్ సలహా
కావ్య మారన్ ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అందాల ఐపీఎల్ జట్టు ఓనర్.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైతే చాలు క్రికెట్ చీర్ గర్ల్స్ కంటే ముందు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుతో పాటు హైదరాబాద్ అభిమానులను ఉత్తేజపరిచడానికి ముందు ఉండే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు కావ్య మారన్.
అంతటి పబ్లిసిటీ సాధించిన కావ్య మారన్ నిన్న బుధవారం జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశంలో బీసీసీఐకు ఓ కీలక సూచన చేసినట్లు తెలుస్తుంది. ఒక్కొ ప్రాంచేజీ ఏడుగుర్ని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని కావ్య మారన్ బీసీసీఐను కోరినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఆ ఏడుగురిలో విదేశీ స్వదేశీ ఆటగాళ్లు ఉండేలా ఛాన్స్ ఆక్షన్ సమయంలో రిటైన్సన్ గురించి ఆటగాళ్లతో చర్చించే అవకాశం కల్పించాలి.. ఐదేండ్ల కోకసారి మెగా వేలం నిర్వహించాలని కావ్య మారన్ బీసీసీఐను ఐపీఎల్ ఓనర్ల తరపున కోరినట్లు సమాచారం.