కవిత సెల్ఫ్ గోల్..!

kalvakuntla kavitha
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెల్సిందే. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎవర్ని వదిలిపెట్టకుండా వారి గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలకంటే తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తనకు తాను సెల్ఫ్ గోల్ వేసినట్లు ఉన్నాయని పొలిటీకల్ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తూ తాను తప్పటడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ఉదంతంలో మాజీమంత్రి హరీష్ ను ఇరికించబోయి, తనకు తానే సెల్ఫ్ గోల్ కొట్టుకుంది ఈ దెబ్బతో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ ఇమేజ్ మరింతగా పెరిగి పోయింది…
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వేచి చూసి, అప్పుడు గనుక తన సొంత పార్టీ మీద (లేదా తన సొంత కుటుంబ సభ్యుల మీద) తిరుగుబాటు చేసి ఉంటే.. ఆమె ఆశించిన ఫలితం కొద్దోగొప్పో రాబట్ఝుకుని ఉండెదేమో అని వారు చెబుతున్నారు… కానీ ఇప్పుడు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా ప్రజల తరపున కోట్లాడకుండా కేవలం తన రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్ పై, నేతలపై విమర్శలు చేయడం తనకే మైనస్ అయ్యాయని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదు. బీఆర్ఎస్. మాజీ సీఎం కేసీఆర్ వ్యతిరేకులకు రాజకీయంగా ఉపయోగపడే విమర్శనాస్త్రాలు అందించడం తప్ప అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు…