కాకతీయ తోరణం,గీతం మార్పులను కాళోజీ ఒప్పుకునే వాడ్రా?

 కాకతీయ తోరణం,గీతం మార్పులను కాళోజీ ఒప్పుకునే వాడ్రా?

తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతాన్ని మార్చి కిరవాణి సంగీత నేపథ్యంలో ఈరోజు విడుదల చేసిన సంగతి తెల్సిందే. అదే విధంగా రాష్ట్ర చిహ్నాంలో కూడా మార్పులు చేయనున్నట్లు..అందులో కాకతీయ తోరణం..చార్మీనార్ ను తీసేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై మాడభూషి శ్రీధర్ అనే వ్యక్తి కాళోజీ బతికి ఉంటే దీన్ని ఒప్పుకునేవాడా.. అంటూ రాసిన ఓ కవిత వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేయండి..?

‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివి
పదవి అధికారము బూని పదిలముగా తల బోడిజేస్తివి
దాపునకు రాననుచు చనువుగా టోపి పెడితివి లాభపడితివి’
అని ఎన్ని సార్లు తిట్టిపోస్తివి, అందుకు లాభపడితివి.
కాకతీయ ద్వారం నిన్నేమన్న జేసె, చార్మినార్ ఎందుకొద్దురా నీకు
రాజులు వద్దు వద్దు అంటున్నరు గాని, రామప్పగోపురం నిన్నేమన్నది.
‘గిట్టని వానిని కొట్టుటకే కదా, మట్టిగొట్టిన విగ్రహాలను నిన్నేమన్నయి
తోచిన కాడికి దాచుటకే కదా…పొగిడి మన్ననలు పొందుటనే కదా’.
కాకతీయ శిల్పాలు, నిన్నేమన్నయి అసలు ఎందుకు జేస్తున్నర
ప్రపంచమంత మెచ్చిన రామప్పను ఎందుకుబెట్టలేదు చెప్పు
కాటన్ గోదావరి ఆనకట్ట వల్ల ఆంధ్రలో జనానికి బువ్వపెట్టినోడివలె
రామప్ప, లక్నవరం తెలంగాణకు బువ్వ సంస్కృతి నీకెందుకు కనబడకపాయె
ఇదివరకు ఇన్నేళ్లు ఎప్పుడున్నా జైతెలంగాణమన్న వింటినావుర
తెలంగాణ పోరాటంలో పొగలు బెట్టి మంటి బెట్టి, అధికారం రాగానే
‘జయ జయహే తెలంగాణ’ జిందాబాద్, ‘కాకతీయ వైభవం’ వద్దెందుకు
చార్మినార్ నిన్నేమన్నది, తెలంగాణ గీతం నీకు వద్దెందుకు?
‘మనిషి ఎంత చెడ్డవాడు బతికున్న వాని మంచి
గుర్తించడు గాని, వాని చెడుని వెతికి మరీ గెలుకుతాడు’ అన్నట్టు
ఇందుకింత పనిచేస్తివి. నిన్నేమన్న రామప్ప కనబడట్లలేదా.
‘అవకతవకలు సవరింపలేనప్పుడు ఎందుకో నా హ్రుదిని ఇన్ని ఆవేదనలు’
అందుకే కాళోజీ ఇదివరకే అన్నడు గదరా
‘నీకు ఎన్నుకుంటె వెలగటెట్టడం కాదు
ఇంక ఇప్పటిదాకా ఏం చేశినవో చూడు
పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు’

కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్
మెచ్చుకుంటే నీకెందుకు, నొచ్చుకోవడం బాధలు నాకిస్తారా?
ఓరుగల్లు ఉంటే, పోతన్న కావ్యం ఇక్కడుంటే నీ ముళ్లేం బోయె.
ఆ గీతంలో రద్దులెందుకు, నా గేయానికి గాయాలెందుకు
ఎందుకింత పనిచేస్తివి. నిన్నేమన్న రామప్ప నిన్నుగొట్టిందా
‘నన్నుకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివి’
ఏంచేయగాక పోకపోతే పోనీ, పేర్లు మార్చుకుంటే అదో గొప్పతనమా?

-మాడభూషి శ్రీధర్ 2.6.2024

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *