కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు

 కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు.

తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ ” సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ కాళేశ్వరం కూలిపోయింది. మేడిగడ్డ దేనికి పనికి రాదంటూ”  విమర్శలు చేశారు. కానీ  ‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డనే కాదు .

కాళేశ్వరం అంటే మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హౌజులు , 203 కిలోమీటర్ల సొరంగాలు,1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్‌, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టిఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టిఎంసీల నీటి వినియోగం అని”మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *