తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టీస్ మదన్ బీ లోకూర్
తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిన సంగతి తెల్సిందే.
అయితే మొదట్లో కమిషన్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా జస్టిస్ మధన్ బీ లోకూర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు.. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ గా పని చేశారు.
పదేండ్లలో విద్యుత్ ఒప్పందాలపై, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది.