న్యాయం గెలిచింది..!ప్రజాస్వామ్యం మురిసింది..!- ఎడిటోరియల్ కాలమ్..!!

 న్యాయం గెలిచింది..!ప్రజాస్వామ్యం మురిసింది..!- ఎడిటోరియల్ కాలమ్..!!

Kalvakuntla Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్నే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక ఊపు ఊపిన ఉదాంతం.ఈ స్కాంలో సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు అందరిపై ఈడీ సీబీఐ అభియోగాలు మోపి అందర్ని నిందితులంటూ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. దాదాపు ఆరేడు నెలలుగా సినిమాట్రిక్ గా ఓ పెద్ద డ్రామానే నడిచింది. ఒకపక్క ఆ లిక్కర్ ఫాలసీ రద్ధు చేశామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కానీ ఆ ఫాలసీ వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం చేకూరింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు రూ.100కోట్ల ముడుపులు అందాయి.. ఆప్ పార్టీకి ప్రత్యేక్షంగా పరోక్షంగా లాభం చేకూరింది.. అప్పట్లో జరిగిన గోవా ఎన్నికలకు ఈ స్కాం డబ్బులే ట్రాన్సఫర్ అయ్యాయని ఆరోపిస్తూ కేసులు పెట్టింది ఈడీ..సీబీఐ.. నోటీసుల పేరుతో వీరందరిని అరెస్ట్ చేసి మరి తీహార్ జైల్లో ఉంచింది.

ఈ కేసులో ఒక్కర్ని కాదు ఇద్దర్ని కాదు ఏకంగా 493మందిని సాక్షుల పేరుతో విచారించింది కూడా. అయితే ఈ క్రమంలో అరుణ్ పిళ్లే ఇచ్చిన స్టేట్మెంట్ లో కల్వకుంట్ల కవిత పేరు ఉంది అనే నేపథంతో మార్చి 15 తారీఖున అరెస్ట్ చేసింది ఈడీ. ఆ తర్వాత జరిగిన తదాంగం అంతా మనకు రోజువారీ సీరియల్ లెక్క మన కండ్లకు కన్పించింది. ఈ రోజు బెయిల్ పిటిషన్ సందర్భంగా జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలను ఇప్పుడు ఇక్కడ నోటిఫై చేసుకుందాము.. పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొన్న అంశాలు ” ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (మాజీ) మనీష్ సిసోడియాకు వర్తించిన బెయిల్ నిబంధనలు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకు వర్తించవు.. సెక్షన్ -45 ఎందుకు కవితకు వర్తించకూడదు. విచారణ పేరుతో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదారు నెలలు ఎందుకు జైల్లో ఉండాలి.. ఓ మహిళగా కవితకు ఎందుకు హక్కులుండవు.. ఈ కేసులో సీబీఐ తుది ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది..

ఈడీ కేసు విచారణను పూర్తి చేసినప్పుడు ఎందుకు ఇంకా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి బెయిల్ పై బయటకు వెళ్లకుండా జైల్లో ఉండాలి” అనే అంశాలను ఈడీ తరపున వాదిస్తున్న అదనపు సొసిలిటర్ ఎస్వీ రాజును జస్టీస్ బీఆర్ గవాయ్ ,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం నుండి ఊహించని ప్రశ్నలు రావడంతో ఉక్కిరిబిక్కిరైన ఈడీ తరపున న్యాయవాది ఎస్వీ రాజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను.. ఈ కేసులో సాక్షుల పేరుతో విచారించబడిన వారి నుండి తీసుకున్న స్టేట్మెంట్ ను చదవడం మొదలెట్టారు.. దీనిపై స్పందిస్తూ ధర్మాసనం ఇప్పుడు కావాల్సింది సుధీర్ఘ చర్చ కాదు బెయిల్ పిటిషన్ పై మీ అభిప్రాయం చెప్పండి.. ఎందుకు కవితకు బెయిల్ మంజూరు చేయకూడదో వివరించాలని హూకుం జారీచేయడంతో అవాక్కవ్వడం ఎస్వీ రాజు వంతైంది అని సుప్రీం కోర్టు లోపల ఉన్నవారు గుసగుసలాడుకోవడం జాతీయ మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెల్లువడినాయి.

కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో చెప్పకుండా ” కవిత విచారణ అధికారులకు సహాకరించలేదు.. మొబైల్ ఫోన్స్ మార్చారు.. ఫార్మాట్ చేశారు.. సాక్షులను బెదిరించారు.. రూ..100కోట్ల ముడుపులు అందాయి…”అని ఇలా గత ఐదారు నెలలుగా విచారణ సందర్భంగా చెప్పిందే మళ్లీ చెప్పడం మొదలెట్టారు.. దీనిపై కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ అభ్యంతరం తెలపగా ధర్మాసనం కలగజేసుకోని జస్టీస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ ” నేను కూడా మొబైల్ ఫోన్ మారుస్తాను.. మెసేజ్స్ ఎక్కువైనప్పుడు నేను కూడా డిలిట్ చేస్తాను.. అందులో తప్పు ఏముంది.. విద్యావంతురాలు.. ఎంపీ.. ఎమ్మెల్సీ అయినంతమాత్రాన బెయిల్ ఇవ్వకుండా అపాల్నా… అవన్నీ కాకముందే కవిత ఓ మహిళ అనే సంగతి మరిచిపోయారా.. ?

ఐదారు నెలలుగా సాక్ష్యాలను.. ఆధారాలను ఎందుకు కనిపెట్టలేకపోయారు. అంటే ఆరోపణలు ఉంటే అవి నిజం అని నిరూపించాలి కదా.. ఆరోపణలు ఆధారంగా నిజం అని కోర్టులు నమ్మి తీర్పులు ఇవ్వాల్నా… నిర్ధోషిని నిందితుడిగా పరిగణించి శిక్షించాల్నా.. ముందు ఈ కేసులో ఆధారాలు.. సాక్ష్యాలను వెలికి తీసే పనిలో ఉండండి.. ఐదారు నెలలైన కానీ ఇంతవరకూ ఎందుకు సాక్ష్యాలు ఆధారాలు దొరకలేదు ” అని వ్యాఖ్యానించడం కూడా ఊహించని పరిణామంగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ కాదు ముందు పైన పేర్కోన్న మూడు అంశాల వారీగా కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నాము.. బెయిల్ షరతులను కూడా ఉంచుతామని తమ తీర్పును వెలువరించింది ధర్మాసనం.. దీంతో ఒకపక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుని కేవలం ఆరోపణలతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై కేసులు పెట్టి నెలలు నెలలు జైల్లో ఉంచుతామని చూస్తే న్యాయస్థానం అంటూ ఒకటి ఉంది.

న్యాయస్థానంలో న్యాయం దక్కుతుంది.. అది నిజం అని తాజాగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న కానీ న్యాయవ్యవస్థ అనేది ఒకటి ఉంది .. ఆ వ్యవస్థను ఎవరూ ప్రభావితం చేయలేరు.. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు.. ఇప్పుడు ఆ వ్యవస్థలోనే కవితకు న్యాయం జరిగి బెయిల్ వచ్చింది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ కవితకు బెయిల్ రావడం న్యాయం గెలవడమే కాదు ప్రజాస్వామ్యం మురిసింది . ధర్మం ఎప్పటికైన గెలుస్తుంది… ఆధర్మం ఓడుతుందని అంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *