జగన్ సంచలన ట్వీట్..!

YS JAGANMOHAN REDDY
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈరోజు మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈరోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ను అధికార టీడీపీ శ్రేణులు ఓ ఉగ్రవాదుల్లా హైజాక్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గుండాలా అరాచకాలు చేశారు. అధికారాన్ని, వ్యవస్థను అడ్డుపెట్టుకుని రౌడీల రాజ్యం నడిపిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిన ఈరోజు మంగళవారం బ్లాక్ డే. ఆయన సీఎంగా ఉండగా ప్రజాస్వామ్యం డొల్లని మరోకసారి రుజువైంది. చట్టం , న్యాయం, ధర్మం, నిబంధనలు ఒట్టిమాటలే. ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ ఉపఎన్నికల పోలింగ్ నిర్వహించాలని ఎక్స్ వేదికగా జగన్ డిమాండ్ చేశారు.