జమిలీ ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దుయ్యబట్టారు. త్వరలో ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రస్తుత ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పాను.
చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వ్యాఖ్యానించారు.