కాంగ్రెస్ నేతలకు జగన్ విందు.. ఎందుకో.?
జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా…?. తనను రాజకీయంగా అణగదొక్కడమే కాకుండా తనను తన కుటుంబాన్ని అవమానపాలు చేశారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అసువులు బాసిన వేలాది మందికి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని.. అలాంటిది జగన్ కాంగ్రెస్ నేతలకు విందు ఇవ్వడం ఏంటని ఆలోచనలో పడ్డారా..?. అయిన జగన్ కు కాంగ్రెస్ తో కల్సి పోవాల్సిన అవసరం ఏమోచ్చింది.. ఇప్పుడు ఏమైన కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నదా..?. అంత అవసరం ఏమోచ్చింది ఇప్పుడు అని తెగ ఆలోచిస్తున్నారా..?.
అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు .. ఏపీ అధికార టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బెంగళూరులో తన నివాసంలో కాంగ్రెస్ నేతలకు విందు ఇచ్చారు. అది కూడా శనివారం రాత్రి డిన్నర్ విత్ కాంగ్రెస్ లీడర్స్ అన్నట్లు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. అందుకే జగన్ లేస్తే బెంగళూరు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఈ శనివారం ఈ తంతు జరిగిందని ఆరోపించారు. మరి జగన్ కు నిజంగా కాంగ్రెస్ నేతలకు అది బెంగళూరులో విందు ఇవ్వాల్సినవసరం ఏమోచ్చింది. ఎందుకు జగన్ ఆ విధంగా చేశారు.. కాంగ్రెస్ నేతలతో జగన్ ఏమి మాట్లాడారు.. ఆ విందుకు కాంగ్రెస్ నేతలు ఎవరెవరూ వచ్చారో మీడియా ముందుకు వచ్చి చెప్పాలని కూడా వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
అయితే జగన్ కాంగ్రెస్ నేతలకు నిజంగా విందు ఇచ్చారా..?. ఆ విందుకు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారా..?. గత శనివారం జగన్ బెంగళూరులో ఉన్నారా..?. మరి ఈ అంశం గురించి జగన్ మీడియా ముందుకు వివరణ ఇస్తే కానీ ఆ అంశంపై క్లారిటీ రాదు . మరి జగన్ కాంగ్రెస్ నేతలను ఎందుకు కలవాల్సి వచ్చింది. జగన్ ఎందుకు కాంగ్రెస్ వైపు వెళ్లాలని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ తో జగన్ కు ఏమి పని ఉంది ఇప్పుడు. అసలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అధినేత జగన్ అయితే అంత అవసరం ఏమోచ్చింది. ఇప్పుడు ఒక లుక్ వేద్దాము.
ఇప్పుడు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ పార్టీ మిత్రపక్షం.. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ కూటమి ఏర్పడిందని సాక్షాత్తు మోదీ,అమిత్ షా లే చెప్పారు. అలాంటిది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ దగ్గరవ్వడానికి ఈ రెండు పార్టీలు ఒప్పుకోవు.. పోనీ ఈ రెండు పార్టీల వల్ల బీజేపీకి వచ్చిన నష్టం అయితే ఇప్పట్లో లేదు.. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాజ్యసభలో మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీకి ప్రస్తుతం వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు.
రేపో మాపో వాళ్ళు టీడీపీలో చేరతారు. దీంతో టీడీపీ కి రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. బీజేపీకి కూడా అది ప్లస్ నే.. ఒకవేళ టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందనుకుంటే ఏపీలో బలపడటానికి తన మిత్రుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాగు ఉన్నాడు.సో ఇక్కడ వైసీపీతో బీజేపీకి పెద్ద అవసరమే కాదు పని కూడా లేదు. గతంలో 2014-19మధ్యలో బీజేపీ వైసీపీకి దగ్గరవ్వాలని చూసిన కానీ వైసీపీ కి ఉన్న ఓటు బ్యాంకు అటుదిశగా ప్రయత్నాలు సఫలం కాలేదు. పోనీ ఇప్పుడు వెళ్దామని చూసిన కానీ కమలం కు అవసరం లేదు.
కేంద్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదని ఇప్పటి నుండే రాజకీయ విశ్లేషకులు ,జాతీయ స్థాయి పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. అందుకే ఇండియా కూటమితో బీజేపీని ఢీకొట్టడానికి సిద్ధమయ్యాయి. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒంటరిగానే మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొన్న జగన్ ఢిల్లీలో చేసిన సేవ్ ఆంధ్రా ధర్నాకు కూడా ఇండియా కూటమి నేతలే హజరయ్యారు. దీన్ని బట్టీ చూస్తే జగన్ ఇండియా కూటమికి దగ్గరయ్యే సూచనలు మెండుగా కన్పిస్తున్నాయి. ఆంధ్రాలో అధికారంలో ఉన్న బాబు ఆ స్కాము అని ఈ స్కాము అని వైసీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకి పంపే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు..
క్యాడర్ లో భయం కలగడానికి క్షేత్రస్థాయిలో క్యాడర్, వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. ఆ తర్వాతనే నేతలనే టార్గెట్ చేశారు. రాజకీయాల్లో అపరచాణిక్యుడైన బాబు రాజును కొట్టాలంటే ముందు సైన్యాన్ని కొట్టాలనే యుద్ధనీతిని తెల్సిన అతను జగన్ చుట్టు ఉన్న సైన్యాన్ని కొడుతున్నారు. అది తనదాక రాకూడదనుకున్న .. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పోరాడాలనుకున్న జాతీయ స్థాయిలో మద్ధతు కావాలి.. ఆ మద్ధతు ఎన్డీఏ కూటమి నుండి రాదు. అందుకే ఇండియా కూటమికి దగ్గరవుతున్నారు అని వాదన. నాడే ఒంటరిగా పోరాడిన జగన్ నేడు కాంగ్రెస్ తో కలుస్తాడా అంటే రాజకీయాల్లో ఏదైన సాధ్యమే అని పలు సంఘటనలు మనకండ్ల ముందు కన్పిస్తున్నాయి.