ఆ ఒక్క ఐడీయాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్..!
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ.
అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ సొంత ప్రాంతాలకు ప్రజలు తరలివెళ్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు జగన్. అనుకున్నదే తడవుగా ఊర్లకు వెళ్లిన వైసీపీ అభిమానులను.. కార్యాకర్తలను.. యువతకు గత ఐదేండ్లలో తమ పాలనలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన సంక్షేమాభివృద్ధి పథకాలపై సెల్ఫీ ఫోటోలను ఇటు ఎఫ్బీ.. అటు ట్విట్టర్.. ఇన్ స్టా లో పోస్టు చేసేలా చర్యలు తీసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలను కంటెంటులను సోషల్ మీడియా వైసీపీ విభాగం అందించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నాలుగు లక్షలకుపైగా వీడియోలు.. కంటెంటు.. రీల్స్ పోస్ట్ అవ్వడంతో ఆ రెండు రోజులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకెళ్లిపోయాయి. దీంతో వైసీపీ ఐదేండ్ల పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధి యావత్ ప్రపంచానికి తెలియడమే కాకుండా అక్రమ కేసులు.. నిర్భందాలతో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్న వైసీపీ క్యాడర్ కు మంచి జోష్ వచ్చిందని ఇటు ఆ పార్టీ క్యాడర్.. అటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.