గతం మరిచిన జగన్..!
ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు.
75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను ఆయన కొనియాడారు.ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ వైసీపీ 151సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై అనుమానం లేదా..?.గతం మరిచి జగన్ మాట్లాడుతున్నారు అని కౌంటర్ ఇస్తున్నారు..