రేవంత్ రెడ్డి ఇంత అన్యాయమా…?
నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మీరు మాకిచ్చే బహుమానం ఇదేనా..?. మార్పు మార్పు అని చెబితే నమ్మినందుకు మా జీవితాల్లో చీకటి నింపుతరా..?. ప్రజాపాలన అంటే ప్రజలు ఇక్కట్లల్లో ఉండటమా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని హైడ్రా బాధితులు..
నల్లచెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నివాసాలు.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చివేతలకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.. దీంతో నిన్న శనివారం రాత్రి సమీప ప్రాంతాల్లోకి చేరుకున్నారు..
ఆదివారం ఉదయం నుండి ఆ కూల్చివేతలు ప్రారంభించారు. దీంతో బాధితులు తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. కనీసం టైం పిరియడ్ కూడా ఇవ్వకుండా తాముంటున్న నివాసాలను.. మాకు ఉపాధి కల్పించే షేడ్ లను కూల్చివేస్తున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.. మీరు కింద వీడియోలను చూడోచ్చు.