KCR చేసిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా..?-ఎడిటోరియల్ కాలమ్

 KCR చేసిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడా..?-ఎడిటోరియల్ కాలమ్

Revanth reddy KCR

ఓ మోటు సామెత ఒకటి ఉంటది రాజకీయ నాయకుడ్కి పదవైన ఉండాలి.. లేదా అధికారంలోనైన ఉండాలి.. అప్పుడే ఆ రాజకీయ నేతకు ప్రజల్లో విలువ.. మర్యాదలు.. పనులు అవుతాయి.. కాస్తో గిస్తో ప్రజలకు సేవ చేయచ్చు అని ట్వీంటీ ట్వంటీ తరంలో రాజకీయ నీతి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన నాయకుల కంటే అధికారం కోసం.. పదవుల కోసం పార్టీలు మారిన నేతలే ఎక్కువగా తారసపడతారు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ గెలుపొందిన స్థానాలు కేవల 63..కాంగ్రెస్ గెలిచింది 21.. ఎంఐఎం 07.. బీఎస్పీ 02…సీపీఐ 01. సీపీఎం 01.. వైసీపీ -03.. టీడీపీ15..బీజేపీ 05…ఇతరులు 01 .. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 88..కాంగ్రెస్ 19.ఎంఐఎం 07…. టీడీపీ 02..బీజేపీ 01…ఇతరులు 02 .ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 64.. బీఆర్ఎస్ 39.. ఎంఐఎం 07.. బీజేపీ 08 ..సీపీఐ 01.. ఇది తెలంగాణ విభజన తర్వాత ప్రజలు ఆయా ఎన్నికల్లో తీర్పునిచ్చిన విధానం..

తెలంగాణేర్పడిన మొదట్లో టీఆర్ఎస్ ను బలహీనపరచాలని అప్పటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు .. కుతంత్రాలు పన్నుతున్నారు అని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీ(బీ)ఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే అభివృద్ధిని చూసి తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం చేరారు. ఏకంగా కాంగ్రెస్ ఎల్పీ లేకుండా ఉండేవిధంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది మంది గెలుపొందితే ఏకంగా పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీ(బీ)ఆర్ఎస్ లో చేరడమే కాకుండా స్పీకర్ కి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని లేఖ కూడా రాశారు.

అప్పుడు కేసీఆర్ చెప్పిన మాట బీఆర్ఎస్ రాజకీయం చేస్తాది.. మాది సన్యాసుల మఠం కాదు.. రాజకీయ పార్టీ అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఏమి చేసిన కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. రాష్ట్రం దేశం ముందు నిలబడాలి.. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోని కొంతమంది కుట్రదారుల నుండి కాపాడుకోవడానికి పార్టీ చేరికలను ఆహ్వానించారు కేసీఆర్. ప్రజలు కూడా తమ మద్ధతు అన్నట్లు తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. ఒక్క ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తప్పా..

2014,2018లో కేసీఆర్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు..బీఆర్ఎస్ కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు… వీరిలో ముగ్గురిపై అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిన్న సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.. అప్పుడు బీ(టీ)ఆర్ఎస్ చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు… విప్ లైన అడ్లూరి లక్ష్మణ్ , బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ ,మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి,పొన్నం ప్రభాకర్ ,శ్రీధర్ బాబు చేస్తున్న ఆరోపణ.. అప్పుడు కేసీఆర్ చేసింది రైట్ అయితే ఇప్పుడు మేము చేసింది రైట్.. అప్పుడు కేసీఆర్ చేస్తున్నప్పుడు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆగమాగం ఎందుకవుతున్నారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సూటి ప్రశ్న.

రాజకీయాల్లో ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలు పార్టీలు మారడం సాధారణమే కానీ ఆ మార్పు వెనక ప్రజలకు మేలు చేసేదై ఉండాలి.. రాజ్యాంగ బద్ధంగా ఉండాలన్నదే బీఆర్ఎస్ నేతల వాదన.. కాంగ్రెస్లో చేరిన మా పార్టీ ఎమ్మెల్యేలతో దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలని బీఆర్ఎస్ నేతల సవాల్… మీహాయంలో మా పార్టీ నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా ఎందుకు చేయించలేదు.. రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఎలా ఇస్తారు అని కాంగ్రెస్ నేతల వాదోపవాదనలు.

ఎవరి వాదనలు ఎలా ఉన్న కానీ ప్రజాస్వామ్యంలో న్యాయనిర్ణేతలు ఓటర్ దేవుళ్ళు.. సమయం వచ్చినప్పుడు ఎవరు ఏంటనేది తీర్పునిస్తారు. రాజకీయ నేతలకంటే ఓటర్ దేవుళ్ళు చాలా తెలివైవాళ్లు. అప్పుడు కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.. దీన్నిఆ ఓటర్ దేవుళ్లు ఎలా స్వీకరించారనేది మున్ముందు తెలుస్తుంది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *