తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి ప్రమాదమా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి నిజంగానే ప్రమాదమా..?. సినిమా ప్రారంభం ముందుకు అల్కహాల్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్.. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.. స్మోక్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్ అని ప్రకటనలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైన సభలోనూ… సమావేశంలోనూ మాట్లాడే ముందు రేవంత్ మాటలు ఈ తెలంగాణ సోసైటీకి ప్రమాదం అనే సూచనలు చేయాల్నా అంటే…? .
బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు రాకేశ్ రెడ్డి అవుననే అంటున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” సినిమా ప్రారంభానికి ముందు 𝐒𝐦𝐨𝐤𝐢𝐧𝐠 𝐢𝐬 𝐈𝐧𝐣𝐮𝐫𝐢𝐨𝐮𝐬 𝐭𝐨 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 అని సినిమా ముందు హెచ్చరికలు చేసినట్లు “𝐑𝐞𝐯𝐚𝐧𝐭𝐡 𝐑𝐞𝐝𝐝𝐲’𝐬 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐢𝐬 𝐈𝐧𝐣𝐮𝐫𝐢𝐨𝐮𝐬 𝐭𝐨 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐒𝐨𝐜𝐢𝐞𝐭𝐲”,“𝐑𝐞𝐯𝐚𝐧𝐭𝐡 𝐑𝐞𝐝𝐝𝐲’𝐬 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐢𝐬 Only To Adult Not Childrens అని రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు I&PR వాళ్ళు కానీ డీపీఆర్వో వాళ్లు హెచ్చరిక వేయాలి అని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనేకసార్లు పరుషపదజాలంతో మాట్లాడ్తారు కాబట్టి ఇలా వేయాలని ఆయన అన్నారు. పండబెట్టి తొక్కుతా..బోటీలు మెడలో వేసుకుంటా… లాంటి అనేక పదాలు ఆయన వాడ్తారు కాబట్టి నేటి రాబోవు తరాలు అలా తయారు కాకుండా ఇలా చేయాలని ఆయన అన్నారు.