మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా ..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు ఎలా కడతారు.?
కట్టాక దానికి సంబంధించిన వీడియో విజువల్స్ ఎలా బయటకు పంపుతారనే కోణంలో వివరణ కోసం సభ్యులకు నోటీసులు జారీ చేశారు. వీరందరిపై చర్యలకోసం న్యాయనిపుణుల సలహా తీసుకోనున్నారు. అయితే మహిళా కమీషన్ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా ..? అని ఆలోచిద్దాం ఇప్పుడు.సహజంగా కమీషన్ అది మహిళా కమీషన్ అయిన ఎస్సీ ఎస్టీ కమీషన్ అయిన బీసీ కమీషన్ అయిన కానీ జ్యూడిషియల్ పరిధిలో ఉంటూ ఇటు అధికార పార్టీకి కానీ అటు ప్రతిపక్ష పార్టీలకు కానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే ఓ వ్యవస్థ..
గ్రామ స్థాయిలోని వార్డు మెంబర్ దగ్గర నుండి రాష్ట్ర సీఎం స్థాయి వరకు ఎవరినైన సరే తప్పు జరిగిందని తెలిస్తే కమీషన్ కార్యాలయానికి పిలుపించుకోని మరి విచారించి.. నేరారోపణ నిజమైతే చర్యలు తీసుకునే హక్కు ఉన్న రాజ్యాంగ బద్ధమైన ఓ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఉన్న సభ్యులు కావోచ్చు చైర్ పర్శన్ కావోచ్చు ఎవరైన సరే ఈ నియమనిబంధనలకు లోబడే పని చేయాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఇప్పుడు కమీషన్ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టడం మానవత దృక్పధంలో ఆలోచిస్తే కేటీఆర్ ను అన్నగా భావించి సభ్యులు రాఖీ కట్టి ఉండోచ్చు.. లేదా తమ అభిమానాన్ని చాటుకోవడం కోసమైన కట్టోచ్చు.
అయితే అది కమీషన్ కార్యాలయంలో కట్టడం తప్పా ..? ఒప్పా..? అనేది సభ్యులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైన పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డుపెట్టుకోని నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ లబ్ధి చేకూరేలా వ్యవహరించడం తప్పు కానీ ఇలా వ్యక్తిగతంగా అన్నచెల్లెల బంధానికి ప్రతీకైన రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకోవడం తప్పు కాదు.. వారు కట్టిన ప్లేస్ రాంగైన కానీ చేసిన రాఖీ కట్టడం తప్పు కాదు.. ఒకవేళ చర్యలకు దిగిన కానీ సభ్యులు అనుకోని కాకుండా యాదృచ్చికంగా జరిగిందని వివరణ ఇచ్చి కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు.. సో రాఖీ కట్టడం తప్పు కాదు..? కట్టిన ప్లేస్ తప్పు అంతే…?.. ఎందుకంటే కోర్టులో బెంచ్ ముందు జడ్జికి రాఖీ కట్టడం తప్పు కానీ కోర్టు ప్రాంగణంలో తప్పు కాదు కదా.. ఎందుకంటే ఇక్కడ సభ్యులు న్యాయవాదులు అయితే.. చైర్ పర్శన్ జడ్జి అన్నట్లు ..