టీజీపీఎస్సీనా..? లేక ఏపీపీఎస్సీ నా..?
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా?? అని అడిగిన ప్రశ్నలను చూస్తే, టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగక మానదు.
మలి తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం.ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా?.చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం.తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. తగిన బుద్ధి చెబుతుంది అని ట్వీట్ చేశారు..