వైసీపీలో జగన్ కంటే పవర్ ఫుల్ “అతనేనా”..?
వైసీపీ కి బ్రాండ్ ఇమేజ్ అయన.. పవర్ ఆఫ్ సెంటర్ అయిన మాజీ ముఖ్యమంత్రి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే.. ఇదే మాట సామాన్య కార్యకర్త నుండి మాజీ మంత్రుల వరకు ఎవర్ని అడిగిన సరే చెప్పే జవాబు ఇదే. కానీ తాజాగా వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయంతో వైసీపీలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కంటే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఇంకొకరు ఉన్నారనే అనుమానం కలగకమానదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ తరపున మీడియాలో చర్చలకు అయిన ప్రెస్మీట్లకైన కానీ పన్నెండు మంది జాబితాను ఆయా మీడియా ఛానెళ్లకు వైసీపీ పంపింది.
వీరితోపాటు మాజీ మంత్రుల నుండి ఎమ్మెల్యే.. ఎంపీల వరకు అందరూ పేర్లు ఉన్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు టీవీ టిబెట్ అంటే ముందు గుర్తుకోచ్చే ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన కె రవిచంద్రారెడ్డి పేరు మాత్రం లేదు. దీంతో అవాక్కవడం ఇటు వైసీపీ శ్రేణులు. అటు మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకుల వంతైంది. ఇటీవల సాక్షి టీవీలో జరిగిన ఓ డిబెట్ సమీక్షలో వైసీపీ సీనియర్ నేతలు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలపై రవిచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్లనే పార్టీ అధికారం కోల్పోయింది.
ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం డిపాజిట్లను కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తనపై రవి చేసిన వ్యాఖ్యల వల్లనే టీవీ టిబెట్లకు,మీడియా సమావేశాలకు రవి పేరు పంపలేదని వైసీపీ శ్రేణులు,మీడియా వర్గాలు,రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈ సంఘటనలో ఎవరి తప్పు ఉంటే వాళ్లను పార్టీ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
అంతేకానీ తనను ఏదో అన్నారని ఇలా జాబితాలో పేరు లేకుండా చేయడం అంటే రవిచంద్రారెడ్డిని పొమ్మనలేక పొమ్మన్నట్లు ఉన్నారు అని రవి అనుచరులు వాపోతున్నారు. జగన్ ను విమర్శించిన కానీ ఇంతత్వరగా చర్యలుంటాయో ఉండవో కానీ సజ్జలను అనేసరికి ఇంతత్వరగా రియాక్షన్ ఉందంటే జగన్ కంటే సజ్జల మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ అని గుసగుసలాడుకోవడం వైసీపీ వారి వంతైంది.