ప్రజల సమస్య కంటే అల్లు అర్జునే ముఖ్యమా…?
శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు రెండు గంటల పాటు సంధ్య థియోటర్ దగ్గర సంఘటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్క ముఖ్యమంత్రే కాదు అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు ప్రతిపక్ష ఎంఐఎం ,సీపీఐ లకు చెందిన సభ్యులు కూడా ఈ అంశం గురించి చర్చించారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు కానీ రాష్ట్రంలో అసలు సమస్యలే లేవన్నట్లు దేవాలయం లాంటి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి అది ముఖ్యమంత్రి మాట్లాడటంపైనే సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరం.. ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ సైతం ఆసుపత్రిలో ఉన్నారు.
దీనిపై అందరికి సానుభూతితో పాటు ఈ ఘటనకు కారణమైన వాళ్లందరిపై పీకల్లోతు కోపంతో పాటు అగ్రహాం ఉంది. మీడియా సమావేశంలోనూ.. అదే అసెంబ్లీలో పది పదిహేను నిమిషాల పాటు మాట్లాడి వదిలేయాల్సిన అంశాన్ని సాగదీశారు. ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీల అమలుపై.. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు.. లగచర్ల రైతుల అరెస్ట్.. గురుకులాల్లో రోజుకోకటి వెలుగులోకి వస్తున్న ఫుడ్ ఫాయిజన్ సంఘటనపై.. దాదాపు ఇప్పటివరకు యాబై నాలుగు మంది మృత్యువాత పడిన విద్యార్థుల గురించి చర్చించకుండా అల్లు అర్జున్ అంశాన్ని ముందరేసుకోవడం ఇటు రాజకీయ వర్గాల్లో అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి మూటకట్టుకున్నారు.
ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం.. దాదాపు రెండు దశాబ్ధాలుగా సంధ్య ధియోటర్ కెళ్తున్నాను. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఆ బాధిత కుటుంబానికి రేవతి ను తీసుకురాలేను. ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా అదుకుంటాను. ఇరవై ఐదు లక్షలు ముందు ఇస్తున్నాను. భవిష్యత్తులో ఆ కుటుంబం బాధ్యత తనదే అని ఇటు పుష్ప యూనిట్ అటు అల్లు కుటుంబం ప్రకటించిన తర్వాత సభలో ఈ అంశాన్ని తీసుకురావడపై అన్ని వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఎందుకంటే ఇదే అంశం కోర్టులో ఉంది. ఏమైన తప్పుంటే లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ సభలో ప్రజల సమస్యలను దృష్టిమళ్లించడానికే అల్లు అర్జున్ అంశాన్ని ముంగట పెట్టుకున్నారు .. ప్రజల సమస్య కంటే అల్లు అర్జునే ముఖ్యమా అని పెదవి విరుస్తున్నారు.