రూ.5 లక్షలివ్వలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటరిచ్చారు.ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్విట్టర్ లో ” పదేండ్ల పాలనలో యువతకు సరైన విద్య ఉపాధి అవకాశాలివ్వకుండా గొర్రెలు బర్రెలు కాచుకొవాలని యువతకు ఉపాధి అవకాశాలు.. విద్యను దూరం చేశారనడం చాలా బాధాకరం..
పదేండ్ల పాలనలో రెండున్నరల క్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాము.. పదిహేడు లక్షల ప్రైవేటు కోలువులిచ్చాము. అఖరికి మీరు ప్రమోట్ చేసుకుంటున్న ఆముప్పై నలబై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు మేము ఇచ్చినవే.. మేము పరీక్షలు నిర్వహించినవే. మీరు వాటి ఫలితాలను విడుదల చేసి ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటున్నారు. గురుకులాల్లో ప్రతి విద్యార్థిపై ఏడాదికి లక్షన్నర రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. మీరు అధికారంలోకి రాగానే గురుకులాలను ఆగం పట్టించారు..
విద్యార్థినీల ఆత్మహత్యలు పెరిగాయి.. విద్యలో నాణ్యత కరువైంది. కల్తీ ఆహారం.. ఇలా గురుకులాలను భ్రష్టూపట్టించారు అని ఆయన ఆరోపించారు.ముందు మన ప్రభుత్వ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ముగ్గురు సాఫ్ట్ బాల్ క్రీడాకారులు తైవాన్ ఇంటర్నేషనల్ టోర్నీకి ఎంపికయ్యారు. వాళ్ల చార్జీలకు ఐదు లక్షల రూపాయలు కూడా మీ అధికారులు ఇవ్వడం లేదంట! ఆ పిల్లలు ఇక గొర్రెలు బర్రెలు కాయకపోతే ఏం చేస్తారు? కేసీఆర్ గారి టైంలో అయితే ఇలాంటి ప్రతిభావంతులైన బిడ్డలకు క్షణాల్లో లక్షల్లో డబ్బులు పడేవి. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని” అని ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ సాక్షిగా పోస్టు చేశారు.