తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్న కోఠి ఉమెన్స్ యూనివర్సిటీ పేరును మార్చింది. దీనికి సంబంధించిన అధికారక ఉత్తర్వులను త్వరలోనే విడుదల కానున్నాయి.
నిన్న మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ఇందిరా గాంధీ భూసంస్కరణలు తీసుకోచ్చారు. ధరణి పేరుతో పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం..
కోఠిలో ఉన్న విమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెడతాము.. దీనికి సంబంధించిన అధికారక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తాము. చాకలి ఐలమ్మ మనుమరాలైన శ్వేతకు మహిళా కమీషన్ సభ్యురాలిగా అవకాశమిచ్చాము.. మహిళలను అన్ని రంగాల్లో అభివృధ్దిలో పథంలో నడిపిస్తాము..చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలంతా సమస్యలపై కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు.