తరచూ తలనొప్పి వేధిస్తుందా..?
మిమ్మల్ని తరచూ తలనొప్పి బాగా వేధిస్తుందా..?.. అసలు తట్టుకోలేకపోతున్నారా..?.అయితే ఈ సింపుల్ టిప్స్ ను పాటించండి..పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందులా ఉపయోగపడుతుంది..ఈ రసాన్ని ఏదైన సిరఫ్ లో లేదా శీతల పానీయాలలో మిక్స్ చేసి తాగితే తలనొప్పి ఇట్నే తగ్గిపోతుంది..
తులసీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి..వాటి సువాసన పీల్చడం వల్ల కూడా లాభం జరుగుతుంది..రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి మసాజ్ చేయాలి.. ఇలా చేస్తే మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
గోరువెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారిణిగా పనిచేస్తుంది..అల్లాన్ని తినడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది.ఒకగ్లాసు వేడినీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.