ఇద్దరి కంటే ఎక్కువమంది కల్సి పార్టీ చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలి…?

Ponnam Prabhakar
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ” రాజ్ పాకాల కుటుంబం పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోలేదు. అందుకే కేసు నమోదు చేశారు. ఒకరిద్దరు కంటే ఎక్కువమంది కల్సి తాగాలంటే స్థానిక ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీస్కోవాలి అని అన్నారు.
అంటే మంత్రి చెబుతున్న ప్రకారం ఇద్దరూ కల్సి మందు తాగితే ఒకే కానీ అంతకుమించి ఎక్కువమంది కూర్చోని తాగాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్నా..?. అలా అని ఏ చట్టం చెబుతుంది. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని చోట మందు తాగకూడదని చట్టం చెబుతుంది.
కానీ ఇంట్లోనో.. లేదా ఏదైన ఫంక్షన్ లోనో తాగితే తప్పు అని ఏ చట్టం చెబుతుంది. చట్టం పై కనీసం అవగాహన లేకుండా సదరు మంత్రి మాట్లాడుతున్నారు . ఓ మంత్రి ఓ విషయం గురించి తెలుసుకోని మాట్లాడితే బాగుంటుంది అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పోనీ ఎక్సైజ్ శాఖ చట్టంలోనైన అలా ఉందా..?. ఒక్కరి కంటే ఎక్కువమంది కూర్చుని తాగాలంటే అనుమతి తీస్కోవాలి అని నెటిజన్లు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
