రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే “హైడ్రా”
తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. సీఎం సోదరుడు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు చెందిన ఫామ్ హౌస్ లపై ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూల్చగలరా..? అని ఆయన ప్రశ్నించారు.
రుణమాఫీ అంశాన్ని ప్రజల నుండి దూరం చేయడానికే హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చారు. హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు. కానీ హైడ్రా చట్టాన్ని అందరికి ఒకేలా వర్తింపచేయాలి. అంతేకాని తమకిష్టం లేనివాళ్లపైనో.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపైనో రుద్ధడం కాదు అని ఆయన ఆరోపించారు.