“హైడ్రా” కీలక నిర్ణయం -సీఎం సోదరుడి కోసమా..?

Hydra’s key decision..!
హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు.
కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది.
మరోవైపు దుర్గం చెరువు పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డి నివాసానికి ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ ఇల్లు ను కూల్చివేయకుండా ఉండటానికే ఈనిర్ణయం అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అల్రేడీ ఉన్న ఇండ్లను కూల్చివేయకూడదనుకుంటే ఇప్పటికే కూల్చేసిన వాటి సంగతి ఏంటని వారు డిమాండ్ చేస్తున్నారు.