హైడ్రా కేరాఫ్ కూకట్ పల్లి
గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న హైడ్రా ఒక్కసారిగా మళ్లీ ఊపులోకి వచ్చింది.. తాజాగా హైడ్రా అధికారులు కూకట్ పల్లిలో ప్రత్యేక్షమైంది.. కూకట్ పల్లి పరిధిలోని నల్లచెరువు దగ్గర దాదాపు ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన చెరువు భూములు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రాకు పిర్యాదు అందింది.
దీంతో రాత్రికి రాత్రే హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ లతో అక్కడకు చేరుకున్నారు. చెరువులో బఫర్ జోన్ పరిధిలో ఉన్న 4ఎకరాల్లో అక్రమణకు పాల్పడి నిర్మించిన దాదాపు యాబైకి పైగా భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
మరోవైపు ఎఫ్‌టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు.. దీంతో ఈ నిర్మాణాలను కూల్చివేతకు దిగారు.