10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్

 10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్

Revanth Reddy

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా పది నెలలవుతుంది ..ఈ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నింటిని అమలు చేసింది..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తాయి..?. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి .? ఓ లుక్ వేద్దాము..!

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీలు.. ఒక్కొక్క గ్యారంటీల్లో మూడు చొప్పున మొత్తం పన్నెండుకి పైగా హామీలను ప్రధానంగా ప్రజల్లోకి.. ఓటర్ల మదిలోకి తీసుకెళ్లింది. మరి ఈ పది నెలల్లో వాటిలో ఎన్ని అమలయ్యాయి.. ఏ హామీ విజయవంతమైందో చూద్దాం.. ! రైతులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఎంతమంది రైతులుంటే అంతమందికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము.. ఎలాంటి షరతుల్లేకుండా మొత్తం నలబై రెండు లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుంది.. రైతులకోసం ఆ మాత్రం చేయమా అని రేవంత్ రెడ్డి అప్పట్లో తెగ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అది ఇరవై లక్షల మందికి మాత్రమే(ప్రభుత్వ లెక్కల ప్రకారం).. ఆ తర్వాత ప్రధానమైన హామీ రైతుభరోసా.. ఈ పథకం కింద రైతులకు ఎకరాకు పదిహేను వేలు.. రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు.. ఆ హామీ గురించి అసలు ఊసే లేదు.

మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇస్తామని చెప్పిన హామీలు ప్రతి మహిళకు నెలకు రూ.2500లతో పాటు ఐదోందలకే గ్యాస్ సిలిండర్ .. ఈ హామీలు ఇప్పటికి నోచుకోలేదు.. గ్యాస్ సిలిండర్ అరకొరా వస్తున్న కానీ ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేల రూపాయల ఉనికే లేదు. యువవికాసం పేరుతో యువతకు ఐదు లక్షల వరకు రుణాలిస్తామన్నారు.. అది లేదు.. చేయూత కింద ఆసరా నాలుగు వేలు ఇస్తామన్నారు. అది లేదు.. ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షలు ఇస్తామన్నారు. ఇది అడ్రస్ లేదు.ప్రతి కుటుంబానికి రెండోందల యూనిట్ల వరకు ఉచితమన్నారు.. అసలు కరెంటే ఉండటం లేదని పిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆరోగ్య శ్రీ పరిమితి పెంచడం తప్పా గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని పూర్తిగా అమలు చేయలేదు.. అఖర్కి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఒక్క డీఎస్సీ తప్పా అన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వాయిదా పడటంతో ఆ ఫలితాలను విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు .. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం మేము వచ్చిన వందరోజుల్లోనే ఈ ఆరుగ్యారంటీలను అమలు చేసి తీరుతాము.. తొలి క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు చట్టభద్రత కల్పిస్తామని చెప్పారు. అందువల్ల ఈ హామీల అమలుపై ఇటు ప్రతిపక్షాలు అటు మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇలా ఆరు గ్యారంటీలే కాకుండా మొత్తం నాలుగోందల ఇరవై హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసిండు అని ఆరోపిస్తూనే ఈ హమీలన్నీ కురిపించారు. ఇప్పుడు వీటి అమలు గురించి అడిగితే కేసీఆర్ ఖజనా ఖాళీ చేసిండని ఆరోపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాడు ఎన్నికల సమరంలో టీవీ డిబెట్ల మాకు సంపదను సృష్టించడం తెలుసు.. అందుకే ఈ హమీలని అన్నోళ్లు నేడు చేతులేత్తేస్తున్నారు. ఏది ఏమైన గత పది నెలల కాంగ్రెస్ పాలనలో వివాదాలతో.. డైవర్ట్ పాలిటిక్స్ తో కాలం గడిపిందే తప్పా ప్రజలకిచ్చిన హమీలను నెరవేర్చడానికి ముందుకెళ్ళినట్లు ఏ కోణాన కన్పించలేదు. గత పది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం పాస్ మార్కులు కూడా వచ్చేలా లేవు. ఎందుకంటే ఇచ్చిన హామీల అమలు చేసిన విధానం చూసిన.. పరిపాలన సంక్షేమాభివృద్ధిని చూసిన కానీ వందకు ఇరవై నుండి ముప్పై మార్కులు వచ్చేలా ఉంది.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇరవై ఐదు నుండి ముప్పై మధ్యలోనే వచ్చేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వందకు ముప్పై మార్కులు.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ముప్పై మార్కులు అన్నమాట.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *